JOB ROLE : VRO, VRA, ASSISTANT.
NUMBER OF VACANCIES :7776.
LAST DATE TO APPLY : TO BE DECLARED SOON.
ANDHRA PRADESH VRO, VRA, ASSISTANTS 7776 JOB VACANCIES 2013 APPLY ONLINE
Andhra Pradesh Public Service Commission
(APPSC) will release a notification for the recruitment of 7776 various
posts like Deputy Tahsildar, Junior Assistants, Office Assistants,
Surveyor, VRO, VRA and Draughtsman in AP Revenue Department for the year
2013-14.
The detailed notification will be available soon on APPSC
official website http://www.apspsc.gov.in.
AP Revenue Dept Recruitment 2013 – 7776 Posts
Deputy Tahsildar –133 Posts
Junior Assistants – 1094 Posts
Office Assistants – 268 Posts
Surveyor – 273 Posts
VRO (Village Revenue Officer) – 1657 Posts
VRA (Village Revenue Assistant) – 4305 Posts
Draughtsman – 46 Posts
Educational Qualification:
Deputy Tahsildar –Degree or its equivalent
Junior Assistants – Intermediate/ 10+2
VRO – Intermediate/ 10+2
VAO – 10th Class/ SSC
Surveyor, Draughtsman
SSC with Certificate in Draughtsman (Civil) Trade
The detailed notification about AP VRO,
VRA, Assistants, Deputy Tahsildar, Surveyor Recruitment 2013 will be
released soon by APPSC with complete detailes like Vacancies, Age Limit,
Age Relaxation, Eligibility, Educational Qualification, Selection
Process, Application Fee, How to Apply etc.
* రెవిన్యూ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ
* మరోమారు వీఆర్వో, వీఆర్‌ఏల నియామకాలు
హైదరాబాద్: రెవిన్యూ శాఖలో భారీగా పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. సుదీర్ఘ కాలంగా భర్తీ చేయని పోస్టులతో బాటు తాజాగా ఏర్పడిన వందలాది ఉద్యోగాల నియామకానికి శ్రీకారం చుడుతున్నారు. డిప్యూటీ తహసీల్దార్‌లు, జూనియర్ అసిస్టెంట్‌లు, సర్వేయర్లు, వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు, డ్రాఫ్ట్స్‌మెన్‌ల పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. రెవిన్యూ శాఖలో 7,776 పోస్టుల భర్తీ చేయనున్నారు.
వీటిలో ఇప్పటికే వెయ్యి పోస్టుల భర్తీ
అంశం ఏపీపీఎస్సీ వద్ద వివిధ స్థాయుల్లో పెండింగ్‌లో ఉంది. దీన్ని
త్వరితగతిన పూర్తి చేయడంతో బాటు కొత్త పోస్టుల భర్తీ చేయడానికి ఏర్పాట్లు
చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో కీలకమైన గ్రామ రెవిన్యూ అధికారుల
(వీఆర్వోలు) పోస్టులు 1657 భర్తీ చేయనున్నారు. ఏపీపీఎస్సీ వద్ద 1102
డిప్యూటీ తహసీల్దార్‌లు, జూనియర్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీ అంశం
పెండింగ్‌లో ఉంది. వీటి భర్తీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసే విషయమై
ఏపీపీఎస్సీ బోర్డుతో సమీక్షించనున్నారు.
ప్రభుత్వం అనుమతించిన 133 డిప్యూటీ
తహసీల్దార్‌ల పోస్టుల భర్తీకి త్వరలో ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల
చేయనున్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇప్పటికే రాత పరీక్ష పూర్తి చేసిన
1,029 పోస్టుల ఫలితాలు విడుదల చేసి, భర్తీ ప్రక్రియను ముగించాల్సి ఉంది.
వీఆర్వో, వీఏఓ, జూనియర్ అసిస్టెంట్ల ఉద్యోగాల భర్తీకి అనుమతించాలని ఆర్థిక
శాఖను రెవిన్యూ శాఖ కోరింది. భారీగా నియామకాలు చేపట్టనున్న తరుణంలో వయో
పరిమితిని పెంచాలని రెవిన్యూ మంత్రి కోరినట్లు తెలిసింది.
* డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులు 46 భర్తీ చేయనున్నారు. వీటిలో 28 పోస్టులకు ప్రభుత్వం అనుమతించింది. మరో 18 పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
* జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో 15 జూనియర్ అసిస్టెంట్‌ల పోస్టులను రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.
* డిప్యూటీ సర్వేయర్ పోస్టులు 273 భర్తీ చేయనున్నారు. వీటిలో 123 పోస్టులకు ప్రభుత్వం గతంలోనే అనుమతించగా మరో 150 పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
* రాష్ట్రంలో 1657 వీఆర్వో పోస్టులు, 4305 వీఆర్‌ఏలు, భూపరిపాలనశాఖ ప్రధాన కమిషనర్ కార్యాలయంలో 63 జూనియర్ అసిసెంట్‌ల పోస్టులు, మరో 268 కార్యాలయ సహాయకుల పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు వెళ్లాయి.
* ప్రభుత్వం అనుమతించిన 133 డిప్యూటీ తహసీల్దార్‌ల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన ఇవ్వాల్సి ఉంది. మరో 1,029 జూనియర్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి ఇప్పటికే పరీక్ష నిర్వహించగా ఫలితాలు వెలువరించాల్సి ఉంది.

0 comments:
Post a Comment